దేశవ్యాప్తంగా వరల్డ్ కప్ ఫీవర్ తీవ్రస్థాయికి చేరింది. ప్రపంచకప్ ఫైనల్ సంగ్రామానికి ఇంకా కొన్ని గంటలే మిగిలుంది. ఇవాళ ఆదివారం అయినా.. ఈరోజు త్వరగా గడిచిపోయి.. సాయంత్రం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. లైజర్ షోలో, టపాసుల చప్పుల్లలో రోహిత్ సేన కప్పు ఎత్తుతుంటే చూసి తరించాలని ఆశిస్తున్నారు. మొత్తం లక్షా 30 వేల మంది మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియానికి వెళ్లగా.. మిగిలిన వారంతా.. టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయారు. కొందరు రిసార్టులు, ప్రొజెక్టర్లు బుక్ చేసుకుని మ్యాచ్ ను ఎంజాయ్ చేయబోతున్నారు. మిగతా పనులున్న వారంతా.. మ్యాచ్ కోసం వాటిని ఎక్కడికక్కడ ఆపేశారు.
టికెట్ బుక్ అయిన చాలామంది ఎక్కడెక్కడి నుంచో అహ్మదాబాద్ కు చేరుకున్నారు. కాగా హోటల్స్, లాడ్జ్ లన్నీ బుక్ అవడంతో.. చాలామంది అర్ధరాత్రి నుంచి స్టేడియం బయటే పడిగాపులు కాస్తున్నార. మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం మోదీ స్టేడియం బయట ఫ్యాన్స్ కిక్కిరిసిపోయారు. వేల సంఖ్యలో తరలివచ్చారు. దాంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మోదీ స్టేడియం బయట ఫ్యాన్స్ వేచున్న ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Madness at Narendra Modi Stadium for World Cup final. 🔥
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
- Cricket is a religion in India 🇮🇳pic.twitter.com/CnP5IsWFo6