IND vs PAK : ఎటు చూసిన బ్లూ జెర్సీ, భారత జెండా.. స్టేడియం బయట ఇదీ పరిస్థితి
క్రికెట్ అంటేనే భారత అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఇక సొంత గడ్డపై వరల్డ్ కప్, అది కూడా జరుగుతుంది భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంకెంత జోష్ లో ఉంటాయి. టికెట్స్ ఎంత రేట్ పెట్టినా.. హోటల్స్ అందుబాటులో లేకపోయినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మ్యాచ్ చూడటానికి వెళ్తారు. స్టేడియం మొత్తం నిండిపోతారు. ఇక ఆ రోజు రానే వచ్చింది. ప్రపంచంలో అదిపెద్ద స్టేడియం, దాదాపు 1,32,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఆ స్టేడియంలో చూసేందుకు ఫ్యాన్స్ అహ్మదాబాద్ చేరుకున్నారు.
లోపలికి ఎంట్రీ కోసం తెల్లవారుజాము నుంచే స్టేడియం బయట క్యూ కట్టారు. వేల మంది అభిమానులు, వాళ్ల ఒంటిపై టీమిండియా బ్లూ జెర్సీ, చేతిలో త్రివర్ణ పతాకంతో.. స్టేడియం ప్రాంతం మొత్తం సందడిగా మారింది. ‘ఇండియా.. ఇండియా’ అంటూ నినాదాలు చేస్తూ.. అహ్మదాబాద్ ను హోరెత్తిస్తున్నారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన చాలామంది ప్రేక్షకులు విరాట్ కోహ్లీ నెంబర్ 18 జెర్సీ ధరించి తమ ప్రేమను చాటుకున్నారు. కోహ్లీ వీరాభిమానులు అతనికి మద్దతు తెలుపుతూ.. ఈ మ్యాచ్ లో విరాట్ తప్పకుండా సెంచరీ చేస్తాడు. హీరో అవుతాడంటూ చెప్పుకొచ్చారు.
#WATCH | Gujarat: Cricket fans throng Narendra Modi stadium in Ahmedabad ahead of the India Vs Pakistan match today#INDvsPAK pic.twitter.com/cZtbrhEenT
— ANI (@ANI) October 14, 2023
Ahmedabad crowd booing Babar Azam.Thats so disrespectful. Please do it again 😎 #INDvsPAK pic.twitter.com/ISgGl6lOcs
— BALA (@erbmjha) October 14, 2023