Dhruv Jurel : అతడు మైండ్ పెట్టి ఆడాడు..టీమిండియాకు మరో ధోని దొరికాడు..గవాస్కర్

Update: 2024-02-26 05:00 GMT

రాంచీ టెస్ట్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో టీమిండియా క్రికెటర్ ధ్రువ్ జురెల్ దుమ్ములేపాడు. ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో టాప్ ఆర్డర్ కాస్తా తడబడ్డ 90 పరుగులతో చక్కని ప్రదర్శన చేసి భారత్ ను గట్టేకించే ప్రయత్నం చేశాడు. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విజయానికి భారీ రన్స్ కావాల్సి ఉండగా..టాప్ ఆర్డర్ విఫలమైంది. అయితే తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ధ్రువ్ అద్భుతంగా ఆడి టీమిండియా ఇన్నింగ్స్ ను విజయానికి చేరువగా నడిపించాడు. కొద్దిలో సెంచరీ మిస్ చేసుకొని 90 పరుగులతో తొలి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.




 


కష్ట సమయంలో భారత్ ను సమర్థవంతంగా ముందుకు నడిపించిన ధ్రువ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ధ్రువ్ జురెల్ ఆడిన తీరు ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా మైండ్ ఉపయోగించి ఆడాడని కొనియాడాడు. జురెల్ ఆటతీరును చూస్తుంటే మరో ధోనీ తయారవుతున్నట్టుగా అనిపిస్తోందని తెలిపారు. రాంచీలో టెస్ట్ లో ఆడినట్టే మున్ముందు ఆడితే జురెల్ ఎన్నో సెంచరీలు సాధిస్తాడని, అతడికి పరిస్థితులను అర్థం చేసుకుని ఆడడం ఎలాగో తెలుసని గవాస్కర్ అన్నారు. అయితే 23 ఏళ్ల జురెల్ కు ఇది రెండో టెస్టు మాత్రమే. రాజ్ కోట్ టెస్టుతో ఆరంగేట్రం చేసిన ఈ యువ వికెట్ కీపర్ టీమిండియాకు భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడని భారత మాజీలు అభిప్రాయపడుతున్నారు.




Tags:    

Similar News