thumb: జట్టులో నాకు ఫ్రెండ్స్ లేకుండా పోయారు
ఇదివరకు టీమిండియా ఆటగాళ్లు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్లో మనందరికీ తెలిసిందే. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా చాలా బాగుండేది. కానీ, రానురాను చాలా మారిపోయింది. ఫ్రెండ్స్ గా కాకుండా కేవలం తోటి ఆటగాళ్లుగా మారిపోతున్నారు. ప్లేయర్ల బంధం కేవలం గ్రౌండ్ వరకే పరిమితం అయిపోతుంది. ఈ విషయంపైనే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. టీంలో తను ఒంటిరి వాడిని అయిపోయానని.. తనతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘ఇదివరకు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ సందడిగా ఉండేది. ఆటగాళ్ల మధ్య ఫ్రెండ్షిప్.. వాళ్ల మధ్య బాండింగ్ చాలా బాగుండేది. నాతో చాలామంది ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ గా మారిపోయాం. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. టీమిండియా ఆటగాళ్లెవరూ ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేసుకోవడం లేదు. జట్టు సభ్యులను కేవలం తోటి ఆటగాళ్లగానే భావిస్తున్నారు. నాతో ఎవరూ మాట్లాడరు. విషయాలను షేర్ చేసుకోరు. ఈ పరిస్థితులేవి నాకు నచ్చటం లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనే.. బంధం మెరుగుపడుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆటలో మెలుకువలు అర్థం అవుతాయి. నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అదే జరిగింది. అప్పటి ఆటగాళ్లు నాతో బాగా స్నేహం చేశారు. అది నా ఆటతీరును మెరుగుపరుచుకోవడానికి సాయపడింది. నేను బౌలర్ గా ఉండటం వల్లనే ఇలా జరుగుతుందేమో. ఇక బ్యాటర్ గా మారిపోతా’ అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.