బీసీసీఐ.. టీమిండియా కొత్త స్పాన్సర్ ను ప్రకటించింది. ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11.. భారత క్రికెట్ జట్టుకు రానున్న మూడేళ్ల పాటు లీడింగ్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నది. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లిడించింది. జులై 12 నుంచి ప్రారంభం కాబోయే వెస్టిండీస్ సిరీస్ నుంచే డ్రీమ్ 11 కిట్ స్పాన్సర్ గా ఉంటుంది. అయితే, డ్రీమ్ 11తో జరిగిన ఫైనాన్షయల్ డీలింగ్ గురించి పూర్తి వివరాలు మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. దీంతో గతంలో అఫిషియల్ స్పాన్సర్ గా ఉన్న డ్రీమ్ 11.. ఇప్పుడు లీడింగ్ స్పాన్సర్ గా మారింది.
🚨 NEWS 🚨: BCCI announces Dream11 as the new #TeamIndia Lead Sponsor.
— BCCI (@BCCI) July 1, 2023
More Details 🔽https://t.co/fsKM7sf5C8