బీసీసీఐ సెలక్టర్​లకు సర్ఫరాజ్‌ఖాన్‌ కౌంటర్..

Update: 2023-06-25 14:32 GMT

దేశవాళీ క్రికెట్ లో అద్బుతంగా రాణిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్‌. గత రెండు, మూడేళ్లుగా పరుగుల వరద పారిస్తున్నాడు. సర్పరాజ్ ఖాన్ ఫామ్ చూసి టీమిండియాలోకి రావడానికి ఎంతో టైమ్ పట్టదని అంతా భావించారు. కానీ సెలెక్టర్లు మాత్రం సర్ఫరాజ్ ఖాన్‌‌ను మొండి చేయి చూపిస్తునే ఉన్నారు. తాజాగా వెస్టిండీస్ టూర్‌కు కూడా సర్పరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయలేదు. దీంతో సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.జట్టులోకి వచ్చేందుకు అర్హత సాధించాలంటే అతడు ఇంకా ఏం చేయాలంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. తనను సెలెక్ట్​ చేయకపోవడంపై సర్ఫరాజ్‌ఖాన్‌ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఒకేఒక్క పోస్ట్ తో తన అసంతృప్తిని బయటపెట్టాడు.




 


వచ్చే నెల వెస్టిండీస్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ టూర్‌కు సంబంధించి రెండు రోజుల కిందట

బీసీసీఐ వన్డే, టెస్ట్ జట్టులను ప్రకటించింది. యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు టెస్ట్​ టీమ్​లో చోటు కల్పించారు. ఛెతేశ్వర్‌ పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటు పడింది. పేసర్ ముకేష్ కుమార్‌కు రెండు జట్లలో అవకాశం దక్కించుకున్నాడు. అయితే రంజీల్లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్‌ఖాన్‌‌కు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. కేవలం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేయడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.




 


తాజాగా జట్టు ఎంపికపై సర్ఫరాజ్ ఖాన్ కూడా స్పందించాడు. నేరుగా ఎటువంటి కామెంట్ చేయకుండానే సెలక్టర్లకు కౌంటర్ ఇచ్చాడు. రంజీలో తన గణాంకాలు, సహా తన బ్యాటింగ్ వివరాలు, చేసిన పరుగుల వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. అయితే ఈ పోస్టుకు సర్ఫరాజ్‌ ఖాన్ క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. దీంతో సర్ఫరాజ్‌ఖాన్‌ సెలక్టర్​లకు నేరుగా కాకుండా ఈ విధంగా గట్టి కౌంటర్​ ఇచ్చాడని అభిమానులు భావిస్తున్నారు.

25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో దాదాపు 80 సగటుతో 3505 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 9 ఫిఫ్టీలు ఉన్నాయి. దేశవాలీ క్రికెట్‌లో సర్ఫరాజ‌్ కు మించిన గణాంకాలు ఇతర ఏ క్రికెటర్‌కు లేవు




 


Tags:    

Similar News