Title : World Cup : ముగిసిన పాకిస్తాన్ కథ.. ఇంగ్లాండ్ ఘన విజయం
వరల్డ్ కప్లో పాకిస్తాన్ కథ ముగిసింది. ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ 93 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఒకవేళ పాక్ సెమీస్ వెళ్లాలన్న భారీ తేడాతో గెలవాలి. ఇంగ్లాండ్పై 287 రన్స్ తేడాతో గెలిస్తే మాత్రమే పాక్ సెమీస్కు వెళ్లేది. కానీ ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడంతో పాక్ ఆశలు అడియాశలయ్యాయి. ఇంగ్లాండ్ టీం నిర్ణీత 50ఓవర్లలో 337 రన్స్ చేసింది. బెన్ స్టోక్స్ 84, రూట్ 60, బెయిర్ స్టో 59 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టగా..మహ్మద్ వసీం 2, షాహీన్ అఫ్రిది 2 వికెట్లు తీశారు.
ఈ టార్గెట్ను పాక్ 6.4 ఓవర్లలో చేధిస్తే సెమీస్కు వెళ్లే అవకాశం ఉండేది. కానీ అది అసాధ్యం. పాక్ 6.4 ఓవర్లలో కేవలం 30 రన్స్ మాత్రమే చేసింది. ఇక 338 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ 244 రన్స్కే ఆలౌట్ అయ్యింది. ఆఘా సల్మాన్ 51, బాబర్ అజామ్ 38, రిజ్వాన్ 36, హరీస్ రవూఫ్ 35 రన్స్ చేశారు. మిగితా బ్యాట్స్ మెన్స్ అందరూ తక్కువ స్కోర్లకే ఔట్ అవ్వడంతో 43.3 ఓవర్లలోనే పాక్ ఆలౌట్ అయ్యింది. దీంతో ప్రపంచకప్ లో దాని కథ ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీశారు.