కేఎల్ రాహుల్‌కు అంత సీన్ లేదు.. లైట్ తీసుకోండి: భారత మాజీ కోచ్

Update: 2023-08-16 14:33 GMT

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గా అందరి దృష్టిని ఆకర్శించిన కేఎల్ రాహుల్.. వరుసగా గాయాలపాలై, ఫామ్ కోల్పోయి, ఇప్పుడు జట్టులో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో గాయపడిన రాహుల్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఆసియా కప్ కు దూరం అయ్యాడు. వరల్డ్ కప్ వరకైనా కోలుకుని జట్టులోకి వస్తాడో లేదో అనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్న రాహుల్ నెట్స్ లో బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దాంతో ఆసియా కప్ లో రాహుల్ ను చూస్తామనే ఆశలు అభిమానుల్లో కలుగుతోంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ సమస్య కూడా తీరిపోయి.. బ్యాటింగ్ లైనప్ బలపడుతుందని అనుకుంటున్నారు.




ఈ క్రమంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్ కోసం భారత జట్టులో రాహుల్ అవకాశం కనిపిస్తున్న వేళ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గాయాల నుంచి కోలుకున్నవాళ్లు మురుక్షణమే జాతీయ జట్టులో ఆడటం కుదరదు. వాళ్ల మునపటి స్థితిలో ఆడలేరు. ఈ క్రమంలో రాహుల్ పై భారీగా అంచనాలు, భరోసా పెట్టుకోవద్దని రవిశాస్త్రి అన్నారు. తుది జట్టులో అతన్ని తీసుకోకపోవడమే మంచిదని సూచించారు. దీనికి పలువురు క్రికెట్ ఎక్స్ పర్ట్స్ వత్తాసు పలుకుతున్నారు. ఫామ్ లో ఉన్నాడో లేడో అని తెలియకుండా మెయిన్ జట్టులో చోటు కల్పించి మరోసారి టోర్నీల్లో విఫలం అవ్వొద్దని సూచిస్తున్నారు.




Tags:    

Similar News