భారత్-పాక్ మ్యాచే కాదు...మిగతా మ్యాచ్ ల షెడ్యూల్ లోనూ మార్పు

Update: 2023-07-28 06:26 GMT

వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ మార్పు మీద బీసీసీఐ కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చారు. దీని మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని ప్రకటించారు. ఇందులో భారత్-పాక్ మ్యాచ్ ఒక్కటే కాదు మిగతా మ్యాచ్ ల తేదీలను కూడా మార్చాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే తేదీల విషయంలో ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదని....త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.




 


అక్టోబర్ 15న జరిగే భారత్-పాక్ మ్యాచ్ తేదీని మార్చాలని సెక్యూరిటీ సంస్థలు బీసీసీఐ కి విజ్ఞప్తి చేశాయి. ఆ రోజు నుంచే దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయని....అహ్మదాబాద్లో వీటిని ఘనంగా చేసుకుంటారు కాబట్టి సెక్యూరిటీ ఇబ్బందులు వస్తాయని చెప్పారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ మ్యాచ్ ల షెడ్యూల్ ను మార్చాలని నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన సమావేశంలో ప్రపంచకప్‌కు సంబంధించిన అన్ని ఆతిథ్య సంస్థలు షెడ్యూల్‌ను మార్చాలని ఐసీసీని అభ్యర్థించాయి. సమావేశం అనంతరం దీనిపై మాట్లాడిన జై షా.. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మాత్రమే కాకుండా ప్రపంచకప్ షెడ్యూల్ మార్చాలని మూడు సభ్య దేశాలు ఐసీసీని అభ్యర్థించాయి. అయితే మ్యాచ్ వేదికలో ఎలాంటి మార్పు ఉండదు. తేదీ మాత్రమే మారుతుందని జై షా తెలిపారు.




 


అక్టోబర్ 15న జరగాల్సిన భారత్ -పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న జరిగే అవకాశం ఉండొచ్చని సమాచారం. వేదిక మారదు కాబట్టి దేవీ నవరాత్రులు మొదలవడానికి ఒకరోజు ముందే మ్యాచ్ అయిపోతే సెక్యూరిటీ ప్రాబ్లెమ్స్ ఉండవని చెబుతున్నారు. తేదీల మార్పు మీద కచ్చితమైన సమాచారం రావాల్సి ఉంది ఇంకా.


Tags:    

Similar News