రోహిత్ శర్మకు గాయం.. మ్యాచ్ ఆడతాడా? కెప్టెన్ గా ఎవరుంటారు!

Update: 2023-06-06 15:05 GMT

రేపు (జూ 7) ఓవల్ వేదికపై ఆస్ట్రేలియా, భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగనుంది. రెండో ఎడిషన్ లో ఛాంపియన్ గా నిలవాలని ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగింలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం అయిందనే వార్త.. ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేసింది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ గాయపడ్డారు. హిట్ మ్యాచ్ బొటన వేలికి దెబ్బ తగిలింది.

ప్రాక్టీస్ చేస్తుండగా బౌన్సర్ వచ్చిన బంతి.. రోహిత్ ఎడమచేతి బొటన వేలిని బలంగా తాకింది. దాంతో అప్రమత్తమైన ఫిజియో, రోహిత్ వేలికి ఫస్ట్ ఐడ్ చేశాడు. ఆ తర్వాత రోహిత్ ప్రాక్టీస్ వదిలి డగౌట్ కి వెళ్లాడు. రేపు జరగబోయే మ్యాచ్ కు రోహిత్ ఆడతాడా లేదా అన్నదానిపై బీసీసీఐ స్పందించలేదు. ఒకవేళ రోహిత్ మ్యాచ్ కు దూరం అయితే.. కెప్టెన్సీ ఎవరు తీసుకుంటారని సందేహంగా మారింది. ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన రహానేను కెప్టెన్ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News