టీమిండియాకు బిగ్‌షాక్..వరల్డ్ కప్‎కు స్టార్ బ్యాటర్ దూరం ?

Update: 2023-06-29 09:57 GMT

2023 వన్డే ప్రపంచకప్‌‌‌కు టీమిండియాను గాయల బెడద వేధిస్తోంది. వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..కానీ ఇంకా గాయాలకు గురైన ప్లేయర్స్ పరిస్థితి అర్థం కావట్లేదు. వారు తిరిగి జట్టులో చేరుతారనే క్లారిటీ రావడం లేదు. వరల్డ్ కప్ జట్టులోకి పరిశీలించే 5-6 ప్లేయర్స్ అన్ ఫిట్‎గా ఉన్నారు. వారిలో బుమ్రా, అయ్యర్, కేఎల్ రాహుల్, పంత్ లాంటి కీలక ప్లేయర్స్ ఉండడం టెన్షన్ పుట్టిస్తోంది. అయితే బుమ్రా, రాహుల్ మాత్రం ఆసియా కప్ నాటికి పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశం ఉంది. పంత్, అయ్యర్ లు పరిస్థితి మాత్రం కాస్త కలవరపెడుతోంది.




 


వెన్నెముక నొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ తో పాటు, wtc ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతో లండన్ వెళ్లి శస్త్ర చికిత్స చేసుకున్నాడు. వరల్డ్ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు. కానీ అయ్యర్ ఫిట్‎నెస్‎పై ఆందోళన నెలకొంది. ఇటీవల రోజుల్లో అతని కోలుకోవడం గురించి చాలా అప్‌డేట్‌లు లేవు. ఇంకా అతడు బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస శిబిరంలో చికిత్స తీసుకుంటున్న అయ్యర్...నొప్పి కోసం ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అతడు వరల్డ్ కప్ నాటికి కోలుకోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. దాదాపు శ్రేయస్ అయ్యర్ ప్రపంచకప్‌కు దూరమవుతాడని వారు భావిస్తున్నారు.




 


గతేడాది చివర్లో జరిగిన ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ జట్టుకు దూరమయ్యాడు. శస్త్రచికిత్సలు అనంతరం కోలుకొని...జట్టులోకి వచ్చే శ్రమిస్తున్నాడు. కానీ అతడు 100 శాతం కోలుకొనే సరికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పంత్ NCAలో కోలుకుంటున్నాడు. అతడు వరల్డ్ కప్ ఆడతాడని అంతా భావిస్తున్నా..మూడు నెలల్లో కోలుకోవడం దాదాపు కష్టమే. రిషబ్ పంత్ ఈ ఏడాది క్రికెట్ ఆడేది అనుమానంగానే ఉంది.




 


Tags:    

Similar News