భారీ మార్పులతో టీమిండియా టెస్ట్ జెర్సీ.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

Update: 2023-07-11 09:08 GMT

వెస్టిండీస్ గడ్డపై టీమిండియా మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఆడనుంది. బుధవారం (జులై 12) నుంచి జరగబోయే ఈ సిరీస్ కోసం టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది. డ్రీమ్ ఎ లెవన్, ఆడిడాస్ స్పాన్సర్ షిప్ లో వస్తున్న ఈ జెర్సీని ధరించిన ఆటగాళ్లు.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. టీమిండియా నయా కిట్ స్పాన్సర్ డ్రీమ్ ఎ లెవన్ పేరు.. మొదటి సారి జెర్సీపై దర్శనమియ్యనుంది. ఎరుపు రంగున్న డ్రీమ్ ఎ లెవన్ లోగోతో జెర్సీ మొత్తం నిండిపోయింది. దాంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రాను రాను టెస్ట్ జెర్సీ మారిపోతుందని, టెస్టుల ఉనికిడి లేకుండా పోతోందని ఆందోళన చెందుతున్నారు. టెస్ట్ జెర్సీని వన్డే జెర్సీగా మార్చుతున్నారని మండి పడుతున్నారు.




 








 




Tags:    

Similar News