పాపం రెడ్ కార్డ్ నిబంధనకు.. మొదట బలైయ్యాడు

Update: 2023-08-28 13:52 GMT

క్రికెట్ లో కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. ముఖ్యంటా పొట్టి క్రికెట్ స్వరూపం మారిపోతుంది. ఇటీవల ఐపీఎల్ 2023లో ఇంపాక్ట్ ప్లేయర్ లాంటి రూల్స్ తెచ్చింది బీసీసీఐ. అదే ఫార్ములాను కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫాలో అయింది. ఈ సీజన్ ద్వారా రెడ్ కార్డ్ నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు. స్లో ఓవర్ రేట్ కు పెనాల్టీగా ఈ రూల్ ను తీసుకొచ్చారు. నిర్ణీత సమయంలో బౌలింగ్ జట్టు వేయాల్సిన ఓవర్ల కంటే వెనుకబడి ఉంటే.. అంపైర్ రెడ్ కార్డ్ చూపించి ప్లేయర్ ను బయటికి పంపిస్తాడు. కాగా, ఈ రూల్ కు మొదట బలైపోయాడు సునీల్ నరైన్.




 


ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ కిట్స్ మధ్య ఆదివారం (ఆగస్ట్ 28) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అంపైర్ రెడ్ కార్డ్ రూల్ ను అమలు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ట్రిన్‌బాగో నైట్ రైడర్స్.. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్లను పూర్తి చేయలేదు. దీంతో నరైన్ గ్రౌండ్ వీడాల్సి వచ్చింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రకారం ఒక్కో ఇన్నింగ్స్ 85 నిమిషాల్లో పూర్తి చేయాలి. దీన్ని బట్టి ఒక ఓవర్ 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి. ఈ లెక్కన 17వ ఓవర్ ను 72 నిమిషాల 15 సెకన్లలో, 18వ ఓవర్ ను 76 నిమిషాల 30 సెకన్లలో, 19వ ఓవర్‌ను 80 నిమిషాల 45 సెక‌న్ల‌లో 19 ఓవ‌ర్లు పూర్తి చేయాలి. కానీ అది జరగలేదు. నిర్ణీత సమయానికి ఒక ఓవర్ వెనకబడి ఉండటంతో.. నైట్ రైడర్స్ కు రెడ్ కార్డ్ చూపించాడు. దీంతో ఆఖరి ఓవర్లో నైట్ రైడర్స్ కేవలం పది మందితో ఆడింది.






Tags:    

Similar News