కోహ్లీ, అనుష్క శర్మ మధ్య ఏం జరిగింది..? ఇన్స్టా పోస్ట్లు వైరల్

Update: 2023-06-11 10:41 GMT

సినీ ఇండస్ట్రీలో అయినా.. స్పోర్ట్స్ లో అయినా.. మోస్ట్ లవబుల్ కపుల్ ఏదీ.. అంటే అందరినోటా కచ్చితంగా వినిపించే పేరు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. వీళ్లిద్దరి మధ్య ఉండే అండస్టాండింగ్, ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమ, నమ్మకం.. కష్టాల్లో ఇచ్చుకునే భరోసా, ధైర్యం.. ఫ్యాన్స్ అందరికీ నచ్చుతాయి. అందుకే ఈ లవ్ బర్డ్స్ అందరికీ ఫేవరెట్. తను డిప్రెషన్ లో ఉన్నప్పుడు తోడుగా నిలిచింది అనుష్క ఒక్కతే అని, తన వల్లే బయటపడగలిగానని కోహ్లీ చాలాసార్లు చెప్పాడు. కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు ఫ్యాన్స్ అంతా అనుష్కను పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా అవుతుంది అని అన్నప్పుడు.. తనకు తోడుగా నిలబడ్డాడు. ఇంత మంచి బాండింగ్ ఈ ఇద్దరి మధ్య లో ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఇద్దరి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్స్ లో ఒకరి గురించి ఒకరు పోస్ట్ చేసుకున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనుష్క పెట్టిన స్టోరీకి కోహ్లీ కౌంటర్ గా మరో పోస్ట్ పెట్టిననట్లు తెలుస్తుంది.‘మీరు సందేహించేవారిని ఇగ్నోర్ చేయండి. కానీ ఆ సందేహాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. వాళ్లతో చర్చింస్తేనే మీకున్న సందేహాలు తొలగిపోతాయి’ అంటూ అనుష్క పోస్ట్ చేసింది.

ఆ పోస్ట్ పెట్టిన గంట తర్వాత ‘మనకు చాలా ఆందోళనలు, భయాలు, సందేహాలు ఉంటే, ప్రశాంతంగా జీవించడానికి, ప్రేమించడానికి మనకు చోటు ఉండదు. అందుకే వాటిని వదిలి జీవించడంపై ప్రాక్ట్సీస్ చేయాలి’ అంటూ కోహ్లీ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత.. నాలుగో రోజు క్రీజులో కుదురుగా కనిపించి కోహ్లీ.. ఐదో రోజు ఆట ప్రారంభం అయిన కొద్ద సేపటికే బోలండ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దాంతో కోహ్లీ అభిమానుల్లో అనుమానం మరింత బలపడింది. ఈ ఇద్దరు మధ్య ఏదో విషయంలో గట్టిగా గొడవ జరిగిందని.. దాని ప్రభావం మ్యాచ్ పై పడి కోహ్లీ త్వరగా ఔట్ అయ్యాడని అనుకుంటున్నారు. 

Tags:    

Similar News