‘సాకులు వెతుకుంటారా.. మెరుగుపడి తిరిగొస్తారా..!’: కోహ్లీ పోస్ట్ వైరల్

Update: 2023-06-20 10:47 GMT

ఈ మధ్య టీమిండియా ఆటగాళ్లను తిట్టేవాళ్లు ఎక్కువైపోయారు. దానికి కారణం కీలక మ్యాచుల్లో చేతులెత్తేసి.. ఘోరంగా ఓడిపోవడమే. గత కొన్ని టోర్నీల్లో చూసుకుంటే మన ప్లేయర్ల ఆటతీరు సరిగా లేదు. టాపార్డర్ నుంచి మొదలుకుని హిట్టర్ల వరకు.. సీనియర్ ఆటగాళ్ల నుంచి మొదలుకుని.. కుర్రాళ్ల వరకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఫెయిల్ అవుతున్నారు. గత తొమ్మిదేళ్లుగా టీమిండియా ఐసీసీ కప్పు కొట్టింది లేదు. సెమీస్, ఫైనల్స్ చేరుకున్నా.. దారుణంగా విఫలం అయి తిరిగొస్తున్నారు. ఈ విషయంలో మాజీ ప్లేయర్లతో సహా ఫ్యాన్స్ కూడా ఆటగాళ్లపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టీమిండియా ప్లేయర్లకు అండగా నిలిచాడు.

ఇవాళ ఉదయం ‘సాకులు వెతుకుంటారా.. మెరుగుపడి తిరిగి వస్తారా’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. గతాన్ని మరిచిపోవాలని.. అప్పుడే ఆటతీరు మెరుగుపడుతుందని సూచించాడు. ట్రోల్స్ ను పట్టించుకోవద్దని చెప్పుకొచ్చాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగిశాక దాదాపు నెల రోజుల పాటు టైం దొరికిన టీమిండియా ఆటగాళ్లు.. ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ తో టూర్లకు తిరుగుతున్నారు. ఈ క్రమంలో విరాట్ మాత్రం జిమ్ లో కసరత్తులు చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. వెస్టిండీస్ సిరీస్ కోసం కోహ్లీ బాగానే కష్టపడుతున్నాడు.






Tags:    

Similar News