పాక్ ఓడాలని బీసీసీఐ కుట్ర చేస్తోంది.. అందుకే ఆ వేదికలను మార్చాలి

Update: 2023-06-19 16:09 GMT

అక్టోబర్ లో భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీసీ ముసాయిదా షెడ్యూల్ ను విడుదల చేసి.. ఆమోదం కోసం ఐసీసీకి పంపించింది. మిగతా క్రికెట్ బోర్డులు కూడా ఈ షెడ్యూల్ కు ఒప్పుకుంటే.. అప్పుడు ఐసీసీ ఆమోదిస్తుంది. ఏ బోర్డుకైనా సందేహాలు ఉంటూ.. బీసీసీఐతో చర్చలు జరిపి, వాటిని క్లియర్ చేస్తుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీబీసీ) ముసాయిదా షెడ్యూల్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో ముఖ్యంగా పాక్ ఆడే రెండు వేదికలపై అసంతృప్తి చేసింది. అఫ్గానిస్థాన్ తో తలపడే చెన్నై వేదిక, ఆస్ట్రేలియాతో ఆడే బెంగళూరు వేదికలను తమకు అనుగులంగా మార్చాలని ఐసీసీని పాక్ బోర్డ్ కోరింది. తమ జట్టు ఓడిపోయేదుకు బీసీసీఐ కావాలనే ఈ వేదికలను నిర్ణయించిందని పాక్ బోర్డ్ ఛైర్మన్ నజం సేథీ అన్నాడు.




 


భయపడే వద్దంటున్నరు:

చెన్నై వేదిక స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇక అఫ్గీనిస్థాన్ లో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు రషిద్ ఖాన్, నూర్ అ హ్మద్ ఉన్నారు. వాళ్లు రెచ్చిపోతే పాకిస్థాన్ గెలవడం కష్టం. ఐపీఎల్ లో గుజరాత్ కు ఆడిన ఈ ఇద్దరు ఎంత ఇంపాక్ట్ చూపించారో తెలిసిందే. ఇక బెంగళూరు స్టేడియం బ్యాటింగ్ పిచ్ అని తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్ వెల్, స్టోయినిస్, మిచెల్ మార్ష్ లాంటి భారీ హిట్టర్లు ఉన్నారు. వాళ్లు క్లిక్ అయితే.. పాక్ కు చుక్కలు చూపిస్తారు. ఈ విషయంలోనే పాక్ భయపడుతోంది. ఈ కారణంతోనే పాక్ బోర్డ్ వేదికలను మార్చాలని ఐసీసీని కోరింది.

బలమైన కారణం ఉంటేనే:

ఈ డిమాండ్ ను బీసీసీఐ కొట్టిపడేసింది. వేదికలను మార్చాలంటే బలమైన కారణం చూపించాలని పాక్ బోర్డ్ ను కోరింది. 2016లో భద్రత కారణాల వల్ల ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ ను పాక్ బోర్డ్ కోరికపై కోల్ కతాకు మార్చారు. ఈ విషయాన్ని గుర్తుచేసిన బీసీసీఐ.. అలాంటి సమస్య ఉంటే చెప్పాలని, లేదంటే వేదిక మార్చడం కుదరదని తెలిపింది.

Tags:    

Similar News