వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌ను 270/8 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. నాలుగో రోజు 84.3 ఓవర్లకు ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ముగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని భారత్ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో అలెక్స్ క్యారీ 66 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ , ఉమేశ్ యాదవ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు, సిరాజ్‌కు ఒక వికెట్ లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 469, టీమ్‌ఇండియా 296 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.