రేపే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్

Update: 2023-06-06 11:23 GMT

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న WTC ఫైనల్ మ్యాచ్‌‎కు సమయం ఆసన్నమైంది. ఓవల్ వేదికగా జూన్ 7 -11 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ జరగనుంది. టైటిల్ పోరుకోసం ఆస్ట్రేలియా, ఇండియా జట్లు సిద్దమయ్యాయి. టీమిండియాకు ఇది రెండో WTC ఫైనల్ కాగా...కంగారులకు మొదటిది. ఇరుజట్లు తుదిపోరులో నెగ్గి చరిత్రసృష్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుది పోరులో భారత్ ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలై మొదటి WTC టైటిల్ చేజార్చుకుంది. ఈ సారి మాత్రం ఎలాగైన కప్పు కొట్టి తీరాలని రోహిత్ సేన కసితో ఉంది. గాయాలతో బుమ్రా, అయ్యర్, కేఎల్ రాహుల్,రిషభ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైన పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

పటిష్టంగా భారత్ బ్యాటింగ్..

ఓవల్ మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మకు తప్ప మిగిలిన బ్యాటర్లు పేలవ రికార్డులు కలిగి ఉన్నారు. ప్రధానంగా కోహ్లీ, రహానె, పుజారాలు ఓవల్‌లో రికార్డులు కలవరపెడుతున్నాయి. రికార్డుల విషయం పక్కనే బెడితే భారత్య బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. భీకరమైన ఆసీస్ పేస్ ఎదుర్కొనే విధంగా ఉంది. ఓపెనర్లు, రోహిత్, గిల్ తో పాటు వరుసుగా పుజారా, కోహ్లీ, రహానె వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. వారి తర్వాత బంతితో పాటు బ్యాట్‌తో రాణించే రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఉండడం భారత్ బలం. వీరిలో శార్దూల్ మినహా అందరూ స్పెషలిష్ట్ బ్యాటర్లు కావడం విశేషం. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ మధ్య పోటీ ఉండగా కేఎస్ భరత్‌‌కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.


 



షమీ, సిరాజ్ పైనే ఆధారం

టీమిండియా బ్యాటింగ్‌తో బౌలింగ్‌లోను స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్‌లతో పేస్ దళం బలంగా ఉంది. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా కీలకం కానున్నాడు. రెండో స్పిన్నర్ అవసరం అనుకుంటే రవీచంద్ర అశ్విన్ అందుబాటులో ఉన్నాడు. షమీ,సిరాజ్‌లపైనే భారత్ ఆశలు పెట్టుకుంది.


 



టైటిల్ ఫేవరేట్‌గా ఆసీస్..

WTC టైటిల్ ఫేవరేట్‌గా ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. భారత బౌలింగ్‌ ఎటాక్‌ ఆస్ట్రేలియాతో పోలిస్తే కాస్త వీక్‌గా ఉండడం..ఆస్ట్రేలియాలోని పరిస్థితులే ఇంగ్లాండ్‌లో ఉండటం ఆసీస్‌కు కలిశొచ్చే అంశం. ఓవల్‌ పిచ్ పేస్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. విపరీతమైన స్వింగ్, బౌన్స్ ఉంటుంది. దీని వల్ల ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొవడంలో భారత్ ఆటగాళ్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కమిన్స్, స్టార్క్‌లను భారత్ బ్యాటర్లు ధీటుగా ఎదుర్కొంటే ఫైనల్లో తిరుగులేకపోవచ్చు. మరో స్టార్ బౌలర్ హాజిలవుడ్ గాయంతో జట్టును వీడాడు. ఆసీస్ స్పెష్టలిష్ట్ స్పిన్నర్‎గా నాథన్ లయన్ బరిలోకి దిగనున్నాడు. ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ఫస్ట్ డౌన్‌లో మార్నస్ లబుషేన్, తర్వాత స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ , కామెరూన్ గ్రీన్ , అలెక్స్ క్యారీలతో ఆసీస్‌కు భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.


 



జట్ల వివరాలు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, అజింక్య రహానె, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్‌, ఉమేశ్ యాదవ్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, ముఖేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్‌ కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్‌), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేసర్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్ మార్ష్, మాట్‌ రెన్‌షా.


Tags:    

Similar News