క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థత..ఆసుపత్రిలో చికిత్స

Update: 2024-01-31 14:37 GMT

టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విమానంలో అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా అనారోగ్యం పాలయ్యారు. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్ విపరీతమైన గొంతునొప్పి, మంటతో బాధపడినట్లు సమాచారం. తీవ్రవాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ అవ్వకముందే ఈ ప్రమాదం జరగడంతో అతడిని హుటాహుటినా అగర్తలలోని ఐఎస్ఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. హానికర ద్రవం తాగడంతో భారత క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలుస్తోంది. విమానంలో మయాంక్ కు ఇలా ఎందుకు జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు.

కాగా మయాంక్ జనవరి 26 నుండి జనవరి 29 వరకు కర్ణాటక జట్టు త్రిపురతో అగర్తలాలో రంజీ మ్యాచ్ ఆడారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని, మయాంక్‌కు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని త్రిపుర ఆరోగ్యశాఖ కార్యదర్శి కిరణ్‌ గిట్టె పేర్కొన్నారు. ‘‘క్రికెటర్‌ను ఎమర్జెన్సీలో చేర్పించి చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. నిరంతరం మా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు’’ అని ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సూచనతో త్వరలోనే బెంగళూరుకు తీసుకురానున్నట్లు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. కోలుకుంటున్న మయాంక్‌ అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. త్వరలోనే బయటకు వస్తా. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారికి.. నాపై ప్రేమ చూపుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ తన ఫొటో షేర్‌ చేశాడు.

Tags:    

Similar News