CSK Jersey 2024 : కొత్త జెర్సీ.. కొత్త స్పాన్సర్.. రెట్టింపు ఆనందంలో CSK అభిమానులు

Byline :  Bharath
Update: 2024-02-16 05:01 GMT

(CSK Jersey 2024) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు ఫ్రాంచైజీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వేలం పూర్తవగా.. మిగతా పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే సీఎస్కే తన అంబాసిడర్ గా కత్రినా కైఫ్ ను ప్రకటించగా.. తాజాగా కొత్త జెర్సీని రివీల్ చేసింది. కాగా ఈ సీజన్ లో సీఎస్కేకు కొత్త స్పాన్సర్ వచ్చింది. యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్ వేస్.. సీఎస్కే ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ జెర్సీని ఆవిష్కరించారు. ముందుగా చెన్నై కెప్టెన్ ధోనీ జెర్సీని లాంచ్ చేశారు. కాగా సీఎస్కే జట్టుకు ఎథిహాడ్ ఎయిర్వేస్, టీవీఎస్ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త జెర్సీలు అభిమానులకోసం అందుబాటులోకి తీసుకొస్తూ లింక్‌ను తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది సీఎస్కే మేనేస్మెంట్.




 


కాగా గత ఐపీఎల్ సీజన్ లో మోకాలి నొప్పితో బాధపడ్డ ధోనీ.. టోర్నీ అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాన్నుంచి కోలుకున్న ధోనీ.. గతకొద్ది రోజులుగా రాబోయే సీజన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్ గా నిలబెట్టిన ధోనీ.. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సమానంగా నిలిచాడు. ఈ ఏడాది కూడా సీఎస్కే కప్పు గెలిచి రికార్డ్ నెలకొల్పాలని చూస్తుంది.




 









Tags:    

Similar News