David Warner:ట్రెండ్ క్రియేట్ చేస్తూ.. రిటైర్మెంట్ ముందు రెచ్చిపోతున్నరు

By :  Bharath
Update: 2023-12-28 10:02 GMT

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ అనంతరం వార్నర్ రిటైర్మెంట్ తీసుకుంటాడు. కాగా ఈ సిరీస్ ద్వారా వార్నర్ ట్రెండ్ క్రియేట్ చేశాడు. అదేంటంటే.. రిటైర్మెంట్ కు ముందు రెచ్చిపోయి ఆడటం ఇప్పటి ట్రెండ్ గా మారిపోయింది. ఈ విషయాన్ని క్రికెట్ విశ్లేషకుడు సి. వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని తెలుగులో ఒక సామెత ఉంది. రిటైర్మెంట్ ప్రకటించి ఆఖరి సీరీస్ ఆడుతున్న ప్లేయర్లు రెచ్చిపోయి ఆడటం ఇప్పటి ట్రెండ్. వన్ డే వాల్డ్ కప్ లో డికాక్, మొన్న పాక్ తో జరిగిన మొదటి టెస్ట్ లో వార్నర్, ఇప్పుడు మనతో డీన్ ఎల్గర్ అలానే రెచ్చిపోయి ఆడేస్తున్నార’ని ట్వీట్ చేశాడు.

ఈ టెస్ట్ లో వార్నర్ చరిత్ర సృష్టించాడు. తొలిరోజు 38 పరుగులు చేసిన వార్నర్.. అన్ని ఫార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. ఇవాళ చేసిన రన్స్ తో కలిపి మొత్తం 18,515 పరుగులు పూర్తిచేసుకున్నాడు. అంతకు ముందు ఈ స్థానంలో స్టీవ్ వా (18,494) పేరిట ఉండేది. కాగా రికీ పాంటింగ్ 27,368 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్ ఇప్పటివరకు టెస్టుల్లో 8,689, వన్డేల్లో 6,932, టీ20ల్లో 2,894 పరుగులు చేశాడు.





Tags:    

Similar News