పాపం ఏబీ డెవిలియర్స్.. ఆటలోనూ కష్టాలే.. లైఫ్లోనూ కష్టాలే
ఏబీ డివిలియర్స్.. కొన్నేళ్ల పాటు క్రికెట్ ను శాసించిన పేరిది. 360 డిగ్రీ షాట్స్ తో బౌలర్లందరినీ ఊచకోత కోసేవాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్ కు భయపడని బౌలర్ లేడు. డివిలియర్స్ బ్యాటింగ్ చేస్తుంటే.. పిచ్ లో యోగా చేస్తున్నట్లు అనిపించేది. ఐపీఎల్ లో ఆర్సీబీకి ఆడిన అతను.. బెంగళూరును తన సెకండ్ హోమ్ టౌన్ గా చెప్తుంటాడు. ఎందుంటే.. కేవలం సౌతాఫ్రికాలోనే కాదు భారత్ లో కూడా డివిలియర్స్ కు వీరాభిమానులు ఉన్నారు. ప్రపంచ మేటి క్రికెటర్ గా ఎదిగిన డివిలియర్స్.. తన కెరీర్ లో ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయాడు. 2018లో ఆటకు గుడ్ బై చెప్పి తన కెరీర్ కు ముగింపు పలికాడు.
క్రికెట్ ప్రయాణంతో తను ఎదుర్కొన్న కఠినమైన సవాళ్లను పంచుకున్నాడు. 13 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో పోరాడిన ఏబీ.. ఒకానొక సమయంలో నిద్రపోయేందుకు స్లీపింగ్ పిల్స్ వాడాడట. ‘తర్వాత రోజు మ్యాచ్ ఉందంటే ఆ టెన్షన్ తో నిద్రపట్టేది కాదు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక స్లీపింగ్ పిల్స్ వాడేవాన్ని. అది మంచిది కాదని తెలిసినా తప్పేది కాదు. అలా 2010 నుంచి 13ఏళ్ల పాటు స్లీపింగ్ పిల్స్ వాడా. ఆ సమస్యతో పోరాడా’ అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో యువతరానికి సందేశం ఇచ్చాడు. వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పని చేయొద్దని కోరాడు.