MS Dhoni : ధోనీపై పరువునష్టం దావా.. పిటిషన్ కొట్టివేయాలన్న మిస్టర్ కూల్

Update: 2024-01-30 01:37 GMT

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో సపరేట్గా చెప్పనక్కర్లేదు. క్రికెట్ చరిత్రలో తనకంటూ తనకంటూ ఒక పేజీ లిఖించుకున్న ఈ మిస్టర్ కూల్..తన మాజీ బిజినెస్ పార్ట్నర్స్ పై చాన్నాళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నాడు. ఓ ఒప్పందం విషయంలో మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య తనను మోసం చేశారని ధోనీ ఆరోపించారు. ఆ మేరకు వారిపై క్రిమినల్ కేసు వేశారు. అయితే, కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకముందే ధోనీ తరపున లాయర్ దయానంద్ శర్మ ప్రెస్మీట్ పెట్టి తమపై ఆరోపణలు చేశారని మిహిర్, సౌమ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమపై లేనిపోని నిందలు వేసి పరువుకు భంగం కలిగించారంటూ ధోనీపై పరువునష్టం దావా వేశారు.

దీనిపై స్పందించిన మాహీ..తన మాజీ వ్యాపార భాగస్వాములు దాఖలు చేసిన పరువునష్టం దావాకు విచారణ అవసరం లేదన్నారు. ఆ పిటిషన్ వెంటనే కొట్టేయాలని ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశాడు. కాగా మిహిర్ దివాకర్ కూడా గతంలో ఓ క్రికెటరే కావడం విశేషం. 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్ లో అతను భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సంస్థను స్థాపించి, ప్రముఖ క్రీడాకారుల క్రీడా వ్యవహారాలు, ఇతర ఒప్పందాలను చూసుకునేవాడు. గతంలో ధోనీ, ఆర్కా స్పోర్ట్స్ మధ్య కూడా ఒప్పందం కుదురింది. మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని, ఫ్రాంచైజీ ఫీజుల్లోనూ, లాభాల్లోనూ వాటా ఇస్తామని మిహిర్ దివాకర్, సౌమ్య అగ్రిమెంట్ చేసుకున్నారు.

అయితే, అగ్రిమెంట్ ప్రకారం క్రికెట్ అకాడమీల ఫ్రాంచైజీ ఫీజులు, లాభాల్లో..వాటాల రూపంలో తనకు రూ.15 కోట్లు ఎగ్గొట్టారంటూ వారిపై ధోనీ న్యాయ పోరాటానికి దిగాడు. ఈ క్రమంలోనే మిహిర్ దివాకర్, సౌమ్య... మహేంద్రుని పై పరువునష్టం దావా వేశారు.




Tags:    

Similar News