MS Dhoni: మరోసారి చిక్కుల్లో పడ్డ ధోనీ.. రాంచీ కోర్టులో కేసు

Byline :  Bharath
Update: 2024-01-05 12:32 GMT

టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. క్రికెట్ అకాడమీ విషయంలో ధోనీ పార్ట్నర్గా ఉన్న ఓ కంపెనీ ఆయనను రూ.15 కోట్ల వరకు మోసగించింది. దీంతో ఆ పార్ట్నర్షిప్ నుంచి తప్పుకున్న ధోనీ.. వారిపై క్రిమినల్ కేసు పెట్టాడు. అసలు విషయానికి వస్తే.. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటుచేసేందుకు పూనుకుంది. 2017లో వారితో ధోనీ ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం

ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ లాభాల్లో ధోనీకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ఒప్పందాన్ని పాటించడంలో కంపెనీ విఫలమైంది. ఈ విషయంలో ధోనీ వారితో చర్చించినా ఫలితం లేకపోయింది.

దీంతో 2021 ఆగస్ట్ 15న ఆర్కా స్పోర్ట్స్ కు ఇచ్చిన అథారిటీ ఒప్పండం నుంచి ధోనీ వైదొలిగాడు. తనకున్న బాకీని తీర్చాలని పలుమార్లు లీగల్ నోటీసులు పంపించినా.. వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ధోనీ కోర్టును ఆశ్రయించాడు. రాంచీ కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేశాడు. ఒప్పందాన్ని విరమించి తనను మోసం చేసినందుకు రూ.15 కోట్ల మేర నష్టం వచ్చిందని కేసులో తెలిపాడు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదైంది. 

Tags:    

Similar News