Dhoni with Trump: అమెరికా మాజీ అధ్యక్షుడితో మిస్టర్ కూల్ గోల్ఫ్ గేమ్.. వీడియో వైరల్

Byline :  Bharath
Update: 2023-09-08 07:02 GMT

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అమెరికా వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో గోల్ఫ్ ఆడిన వీడియో వైరల్ అవుతోంది. ధోని అమెరికాలో ఉన్న విషయం తెలుసుకున్న ట్రంప్.. అతన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీళ్లిద్దరు కలిసి గోల్ఫ్ గేమ్ కూడా ఆడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ధోనీ అంటే తనకు చాలా అభిమానమని, క్రికెట్ ఆడుతుంటే తప్పక చూస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా ఈ విషయం తెలుసుకున్న ధోనీ ఫ్యాన్స్ అమెరికాలో ధోనీ మేనియా అంటూ కామెంట్ చేస్తున్నారు. ధోనీ అంటే అలా ఉంటది. అమెరికా మాజీ అధ్యక్షుడే పిలిపించుకుని టైం స్పెండ్ చేయటం అంటే మాటలా అంటూ పొంగిపోతున్నారు. కాగా ధోనీ ఇటీవల యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ గేమ్ ప్రత్యక్షంగా వీక్షంచాడు. పొడవాటి జుట్టుతో మ్యాచ్ ను చూస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.




 








Tags:    

Similar News