Mohammed Siraj : సిరాజ్‌ బౌలింగ్‌కు రాజమౌళి ఫిదా.. ట్వీట్ వైరల్

Byline :  Veerendra Prasad
Update: 2023-09-18 03:40 GMT

ఆసియా కప్ ఫైనల్ లో టీమిండియా శ్రీలంక జట్టును 10 వికేట్ల తేడాతో ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత పేసర్ల ధాటికి 50 పరుగులకే లంక కుప్పకూలింది. బుమ్రా 1, సిరాజ్‌ 6, హార్దిక్‌ పాండ్యా 3 వికెట్లు పడగొట్టారు. ఒక్క ఓవర్ లోనే 4 వికెట్స్ తీసి దుమ్ములేపిన సిరాజ్.. 12 ఓవర్లులో ఆరు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. దీంతో ఇండియా మొత్తం సిరాజ్ పేరు మారుమ్రోగిపోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సిరాజ్ ట్రెండింగ్ లో నిలిచాడు. సిరాజ్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అతడి ఆటను ప్రశంసిస్తున్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి సైతం.. సిరాజ్ సంచలనంపై ట్వీట్ చేశాడు. సిరాజ్ ఆడిన ఆట తీరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. సిరాజ్ మియాన్.. మన టోలిచౌకి కుర్రాడు ఆరు వికెట్లను పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ కొనియాడారు. తన వేసిన బంతిని బౌండరీ వెళ్లకుండా లాంగ్ ఆన్ వరకు పరిగెత్తి అందరి హృదయాలను గెలిచాడంటూ పోస్ట్ చేశారు. 50 పరుగులకు కట్టడి చేయడంలో బౌలర్ సిరాజ్ ముఖ్య పాత్ర పోషించాడు. శ్రీలంక లాంటి జట్టును కేవలం 50 పరుగులకు కట్టడి చేయడం అంత మామూలు విషయం కాదు అంటూ జక్కన్న సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.



 


Tags:    

Similar News