ICC Worldcup 2023: ‘మెన్ ఇన్ ఆరెంజ్’.. వరల్డ్కప్కు టీమిండియా కొత్త జెర్సీ

Byline :  Bharath
Update: 2023-10-05 13:34 GMT

భారత గడ్డపై ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ 2023 సమరం ఆరంభం అయింది. అహ్మదాబాద్ వేదికపై ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తన తొలి ఆడుతుంది. కాగా వరల్డ్ కప్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఇప్పటికే చెన్నై చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో మన ప్లేయర్లు సరికొత్తగా జెర్సీలతో కనిపించారు. ఆరెంజ్ కలర్ ఉన్న జెర్సీలు ధరించి ప్రాక్టీస్ కు వచ్చారు. ‘మెన్ ఇన్ బ్లూ’ ఆటగాళ్లు ‘మెన్ ఇన్ ఆరెంజ్’లో కనిపించగా.. ఈ జెర్సీ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ట్రైనింగ్ కిట్ ను డ్రీమ్ 11 స్పాన్సర్ చేసింది. టీమిండియా రెగ్యులర్ జెర్సీ తరహాలోనే ఈ జెర్సీపై కూడా మూడు స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి. కొత్త జెర్సీలో ఉన్న తమ అభిమాన క్రికెటర్లను చూసి అభిమానులు పొంగిపోతున్నారు. అయితే, దీనిపై మిశ్రమ కామెంట్స్ వస్తున్నాయి. జెర్సీపై స్పందించిన స్విగ్గీ.. ‘ఆరెంజ్ జెర్సీలో మన ఆటగాళ్లు వరల్డ్ కప్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.







Tags:    

Similar News