భారత్ - ఆస్ట్రేలియా రెండో వన్డేకు వరుణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. దీంతో ఆట మధ్యలోనే ఆగిపోయింది. 9 ఓవర్లు పూర్తైన తర్వాత వర్షం మొదలైంది. అప్పటికి ఆసీస్ స్కోరు 56/2 కాగా.. డేవిడ్ వార్నర్ (26), లబుషేన్ (17) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వర్షం కారణంగా మ్యాచ్ ను 33 ఓవర్లకు కుదించారు. ఆస్ట్రేలియా టార్గెట్ 317 రన్స్గా నిర్ణయించారు. ముగ్గురు బౌలర్లు 7 ఓవర్లు, మరో ఇద్దరు ఆరు ఓవర్ల చొప్పున బౌలింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. మధ్యాహ్నాం భారత్ ఇన్నింగ్స్‌కు సైతం వర్షం అడ్డంకిగా మారింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియాకు 400 పరుగుల లక్ష్యం ఇచ్చింది. శుభ్‌మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) సెంచరీలతో విరుచుకుపడగా.. మ్యాచ్ ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (52) అర్ధ సెంచరీతో చేయగా.. ఇషాన్ కిషన్ (31) రన్స్ చేశాడు. రుతురాజ్ (8) పరుగులకే పరిమితమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.