Alex Lees : కోహ్లీ ఓ ఇడియట్.. పక్కోళ్లను గెలకడంలో ముందుంటాడు

Byline :  Bharath
Update: 2023-11-10 08:21 GMT

విరాట్ కోహ్లీ.. ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతని బ్యాటింగ్ కు కొంతమంది ఫ్యాన్స్ ఉంటే.. గ్రౌండ్ విరాట్ అగ్రెషన్ కు సవరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అతని ఏమన్నా.. తోటి ఆటగాళ్లకు ఏమైనా.. ముందుంటాడు. ప్రత్యర్థికి బ్యాటుతోనే కాదు, నోటితో కూడా సమాధానం చెప్తాడు. అందుకే కోహ్లీతో పెట్టుకోవడానికి భయ పడుతుంటారు. అయితే ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ లీస్ మాత్రం కోహ్లీ ప్రవర్తనను తప్పుబడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ ఓ ఇడియట్ అంటూ ఫైర్ అయ్యాడు.




 


ఎడ్జ్ బస్టన్ వేదికపై 2022లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 416 పరుగులు చేసింది. తర్వాత వచ్చిన ఇంగ్లాండ్ 83 పరుగులకు 5 వికెట్లు కోల్పోతుంది. ఈ దశలో జానీ బెయిర్ స్ట్రోను కోహ్లీ స్లెడ్జింగ్ చేస్తాడు. తర్వాత బెయిర్ స్ట్రో సెంచరీ చేసి కోహ్లీ బుద్ధి చెప్పాడని లీస్ చెప్పుకొచ్చాడు. ‘కోహ్లీ గొప్ప ఆటగాడే. కాదనను. ప్రపంచంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకుని అపోనెంట్ ను స్లెడ్జింగ్ చేయాలని చూస్తుంటాడు. గ్రౌండ్ లో అంతా సమానం. చిన్నా పెద్దా అంటూ ఏం ఉండదు. ఎవరైనా అలా చేయాలని చూస్తే సహించను. అందుకే కోహ్లీ నాకు నచ్చడు. నా దృష్టిలో అతను ఒక ఇడియట్’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.





 



Tags:    

Similar News