ENG vs NZ: వరల్డ్కప్ చరిత్రలో ఇదే తొలిసారి.. రికార్డ్ సృష్టించిన ఇంగ్లాండ్
టోర్నీ చాలా చప్పగా మొదలయింది. అభిమానులు రాలేదు.. ఓపెనింగ్ సెర్మనీ లేదు. అసలు వరల్డ్ కప్ ఫీలింగే రావట్లేదని ఫీల్ అయిన క్రికెట్ అభిమానులకు మంచి కిక్ వచ్చింది. అహ్మదాబాద్ స్టేడియంలో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత ప్రేక్షకులు బజ్ బాల్ రుచి చూశారు. ఇంగ్లాండ్ ను చిత్తు చేస్తూ.. కివీస్ సూపర్ విక్టరీ సాధించింది. కాగా మొదటి మ్యాచ్ లోనే రికార్డులు క్రియేట్ అయ్యాయి. వన్డే వరల్డ్ కప్ లో చరిత్రలో ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిస్ట్రో రికార్డు సృష్టించాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతిని బెయిర్ స్ట్రో సిక్స్ కొట్టాడు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో సిక్సర్ తో ఖాతా తెరవడం ఇదే తొలిసారి. ఈ సిక్సర్ తో ఆ సరికొత్త రికార్డ్ ను బెయిర్ స్ట్రో క్రియేట్ చేసినట్లు క్రికెట్ వర్గాలు ప్రకటించాయి.
అంతేకాకుండా ఈ మ్యాచ్ లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఒక ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన 11 మంది ప్లేయర్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయడం వన్డే చరిత్రలో ఇదే తొలిసారి. ఓపెనర్ గా వచ్చిన బెయిర్ స్ట్రో నుంచి ఆఖరి బ్యాటర్ మార్క్ వుడ్ వరకు ప్రతి ఒక్కరు 10 రన్స్ కంటే ఎక్కువ పరుగులు చేశారు.