World cup 2023: ఆఫ్ఘన్ షాక్తో.. ఇంగ్లాండ్ ఖాతాలో చెత్త రికార్డ్

By :  Bharath
Update: 2023-10-16 07:24 GMT

ఇంగ్లాండ్ జట్టంతా టాప్ ఆటగాళ్లే. పైగా డిఫెండింగ్ చాంపియన్స్. తమ బ్యాటింగ్, బౌలింగ్ తో ప్రత్యర్థికి హడలెత్తించగల సమర్థులు. ఉప ఖండం పిచ్ ల్లోనూ దుమ్ము రేపే సత్తా ఉన్నోళ్లు. తీరా భారత్ లో జరుగుతున్న ప్రపంచకప్ లో తేలిపోతున్నారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండిట్లో ఓడిపోయారు. అదంతా పక్కనపెడితే.. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగన మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్.. 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 40.3 ఓవర్లలో 215 పరుగలకే కుప్పకూలింది. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డ్ ను తమ ఖాతాలో వేసుకుంది. వన్టే వరల్డ్ కప్ లో.. టెస్ట్ మ్యాచులు ఆడే 11 దేశాల చేతిలో ఓడిపోయిన మొదటి జట్టుగా రికార్డ్ ను మూటకట్టుకుంది.

1975లో జరిగిన మొదటి వరల్డ్ కప్ లో.. ఆస్ట్రేలియాతో తలపడిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. 1979లో జరిగిన రెండో వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఓటమి పాలయింది. ఆ తర్వాత 1983లో భారత్, న్యూజిలాండ్.. 1987లో పాకిస్తాన్ జట్లు ఇంగ్లాండ్ ను మట్టికరిపించాయి. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా 1992లో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. 1996లో శ్రీలంక, సౌతాఫ్రికా చేతిలో కంగుతింది. పసికూన జట్లు బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లు.. 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై గెలుపొందాయి. తాజా ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయి టెస్ట్ మ్యాచులు ఆడే 11 దేశాల చేతిలో ఓడిపోయిన మొదటి జట్టుగా రికార్డ్ ను మూటకట్టుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ సెమీస్ ఆశలకు గండిపడేలా ఉంది పరిస్థితి. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో ఒక మ్యాచ్ లోనే గిలిచిన ఇంగ్లాండ్.. మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం ఐదు మ్యాచుల్లో అయినా గెలవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News