World Cup 2023 : నెదర్లాండ్స్కు సెమీస్ అవకాశాలు.. బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
పూణే వేదికగా నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. డచ్ జట్టు సెమీస్ కోసం ఆడుతుంటే.. ఇంగ్లీష్ జట్టు మాత్రం పాయింట్స్ టేబుల్ లో పైకి రావాలని చూస్తుంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలని ప్రయత్నిస్తుంది. ఈ మ్యాచ్ కు మార్క్ ఉడ్, లివింగ్ స్టోన్ దూరం అయ్యారు. వారి స్థానంలో బ్రూక్స్, అట్కిన్సన్ ఆడుతున్నారు. నెదర్లాండ్స్ కు మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తూ సెమీస్ రేసులో ఉంటుంది. లేకపోయినా.. చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో చిన్న జట్ల చేతుల్లో ఇంగ్లాండ్ ఓడిపోతుంటే.. నెదర్లాండ్స్ సౌతాఫ్రికా లాంటి పెద్ద జట్లకు షాక్ ఇచ్చింది.
తుది జట్లు:
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(w/c), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్