ENG vs AUS: ఆసీస్తో ఇంగ్లాండ్ కీలక పోరు.. అయితే సెమీస్ కోసం మాత్రం కాదు

Byline :  Bharath
Update: 2023-11-04 08:32 GMT

అహ్మదాబాద్ వేదికపై ఆస్ట్రేలియా జట్టుతో ఇంగ్లాండ్ కీలక పోరులో తలపడుతుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. వరల్డ్ కప్ లో ప్రస్తుతం అన్ని జట్లు సెమీస్ బెర్త్ కోసం పోరాడుతుంటే.. ఇంగ్లాండ్ మాత్రం చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించేందుకు ఆడుతుంది. పాయింట్స్ టేబుల్ లో చివరి ప్లేస్ లో ఉన్న ఇంగ్లాండ్.. ఆడిన 6 మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచింది. కాగా చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే.. పాయింట్స్ టేబుల్ లో టాప్ 7లో ఉండాలనేది ఐసీసీ రూల్. దాంతో ఇంగ్లాండ్ కు గడ్డు పరిస్థితి ఎదురయింది. మిగిలిన 3 మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ లో టాప్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఆడకుండా ఉండిపోతుంది.

తుది జట్లు:

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(w/c), మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Tags:    

Similar News