హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 7 వికెట్లు నష్టపోయి 427గా ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కన్న 175 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. కాగా క్రీజులో జడేజా 81, అక్షర్ 35 పరుగుల వద్ద ఉన్నారు.