India vs England : రెండో టెస్టులో ఓటమి.. దుబాయ్కి ఇంగ్లాండ్ టీం..
(India vs England)ఉప్పల్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. వైజాగ్ టెస్టులో గెలిచి సత్తా చాటింది. రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి 19వరకు జరగనుంది. రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ గెలవగా.. మూడో టెస్టులో విజయంపై కన్నేశాయి. ఎలాగైన గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ టీం దుబాయ్ వెళ్తోంది.
మూడో టెస్టుకు 10 రోజుల టైం ఉండడంతో ఇంగ్లాండ్ జట్టు దుబాయ్ వెళ్తోంది. అక్కడ రెస్ట్ తీసుకోనంది. ఆటగాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా దుబార్ రానున్నారు. మూడో టెస్టు కోసం ఇంగ్లీష్ జట్టు అక్కడే ప్రాక్టీస్ చేయనుంది. సిరీస్ కు ముందు దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ ప్రాక్టీస్ చేసింది. మూడో టెస్టు కోసం మళ్లీ అదే స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది. ప్రధానంగా స్పిన్ పై ఆ జట్టు ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న తిరిగి వారు ఇండియాకు వస్తారు.
రోహిత్ రికార్డు
ఈ గెలుపుతో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు. అదేంటంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక విజయాల్లో పాలుపంచుకున్న టీమిండియా క్రికెటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రికెట్ హిస్టరీలో టీమిండియా విజయం సాధించిన మ్యాచుల్లో.. రోహిత్ 296 మ్యాచుల్లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ లిస్ట్లో ధోనీ (295)ని రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు. కాగా 313 మ్యాచుల గెలుపులో భాగమైన విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. సచిన్ (307) రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా 296 విజయాల్లో భాగస్వామ్యం పొందిన క్రికెటర్గా రోహిత్ శర్మ నిలిచాడు