ODI World Cup 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

Byline :  Veerendra Prasad
Update: 2023-10-10 05:29 GMT

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో 7వ మ్యాచ్ కాసేపటి క్రితం ధర్మశాల వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లండ్ తరపున బెయిర్‌స్టో, డేవిడ్ మలన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో కూడా స్టోక్స్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. మొయిన్‌ అలీ స్థానంలో రీస్‌ టాప్లే బరిలోకి దిగుతుండగా.. బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మహ్మదుల్లా స్థానంలో మెహది హసన్‌ జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు..

ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే

బంగ్లాదేశ్: తంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, షకీబ్ అల్ హసన్(కెప్టెన్‌), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్‌), తౌహిద్ హృదొయ్, మెహది హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్




 


వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీ కొట్టింది ఇంగ్లండ్. అయితే ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ చిత్తు చిత్తుగా ఓడింది. 280 పైచిలుకు పరుగులు చేసినా ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. న్యూజిలాండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఆ షాకింగ్ ఓటమి నుంచి ఇంగ్లండ్ కోలుకుంటేనే మళ్లీ విజయాల బాట పడుతుంది. ఇక స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అతడు ఈ మ్యాచ్ కు కూడా దూరమయ్యాడు. అయితే అతడికి వీలైనంత సమయం ఇచ్చి పూర్తిగా కోలుకున్న తర్వాతే జట్టులోకి తీసుకోవాలనే నిర్ణయంతో ఇంగ్లండ్ ఉంది. బంగ్లాదేశ్ తో పోలిస్తే ఇంగ్లండ్ బలంగా ఉంది. ఇక్కడ బ్యాటర్లు సక్సెస్ కావాలంటే స్పిన్నర్లను ఎదుర్కోవాల్సిందే.




 






 



Tags:    

Similar News