INDvsENG : తొలిటెస్టులో ఇంగ్లాండ్ టాస్ విన్.. టీమిండియా బౌలింగ్

Byline :  Krishna
Update: 2024-01-25 04:13 GMT

ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇవాళ్టి నుంచి ఉప్పల్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయనుంది. మొదటి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో వెనకబడి ఉన్న టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. సొంత గడ్డపై జరుగుతుండడం భారత్కు అడ్వాంటేజ్గా మారనుంది.

ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్లకు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్లో రాహుల్ కీపింగ్ చేయడని ద్రవిడ్ ఇప్పటికే చెప్పడంతో కీపర్గా కేఎస్ భరత్ను తీసుకున్నారు.

కాగా ఉప్పల్ పిచ్ టీమిండియాకు పెట్టని కోట.. ఇక్కడ ఆడిన ఏ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది లేదు. అందుకే ఈ మ్యాచ్లో టీమిండియానే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. 2005లో ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే.. 2010లో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ వేదికపై ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడిన భారత్.. నాలుగు మ్యాచుల్లో ఘన విజయం సాధించగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది.

టీమిండియా : రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లాండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్(w), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్

Tags:    

Similar News