Drugs case:డ్రగ్స్ కేసు.. ఆస్ట్రేలియా క్రికెటర్కు నోటీసులు

Byline :  Bharath
Update: 2023-09-15 12:01 GMT

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం స్టువర్ట్ మాక్ గిల్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. తాజా విచారణలో దాదాపు 2 కోట్ల 74 లక్షల డీల్ లో మాక్ గిల్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2021లో మాక్ గిల్.. తనను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారులో బంధించి తీసుకెళ్లారని, తనను కొట్టి కారు నుంచి బయటకు విసిరేశారని కేస్ పెట్టాడు. ఈ కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. మాక్ గిల్ వైపు యూటర్న్ తీసుకుంది. మాక్ గిల్ ఫిర్యాదుతో విచారణ చేపట్టి నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని విచారించగా సంచలన నిజాలు బయటికి వచ్చాయి.




 


అరెస్ట్ అయిన వాళ్లలో ఒక వ్యక్తి మాక్ గిల్ బావ కావడంతో కేసు మలుపు తిరిగింది. 2 కోట్ల 74 లక్షల విలువైన కొకైన్ డీల్ లో మాక్ గిల్ ఉన్నట్లు అతను అంగీకరించాడు. అంతేకాకుండా 2019లో కిలో కొకైన్ కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందంలో మాక్ గిల్ పాత్ర ఉందని గుర్తించారు. ఈ కేసులో మాక్ గిల్ ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇటీవల బెయిల్ పై విడుదల అయ్యాడు. ఈ విషయంపై మాక్ స్పందించాడు. తనకు డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతనిపై ఉన్న కేసులో ఎలాంటి ఆధారాలు రుజువు కాలేదు. ఒకవేళ ఆధారాలు దొరికి దోషిగా తేలితే గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది.




 






Tags:    

Similar News