ధోనీకంటే.. మా కీపర్ చాలా బెస్ట్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ Alex Stewart

Byline :  Bharath
Update: 2024-02-12 09:50 GMT

ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఎవరంటే.. ఎవరైనా చెప్పే పేరు ఎంఎస్ ధోనీ. వికెట్ల వెనకాల అతనుంటే ఎంతగొప్ప బ్యాటర్ అయినా సరే.. క్రీజు వదిలి బయటికి వెళ్లడానికి భయపడతారు. కీపింగ్ లో అతను నెలకొల్పిన రికార్డులు అనేకం. దీంతో ధోనీ లాంటి గొప్ప వికెట్ కీపర్ లేడంటూ.. ప్రపంచమంతా అతన్ని కొనియాడుతుంది. అయితే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అకెస్ స్టెవార్ట్ మాత్రం సంచలన ఆరోపణలు చేశాడు. వికెట్ కీపింగ్ లో ధోనీ వేస్ట్ అని, అతనికంటే మెరుగైన ఆటగాడు మా జట్టులో ఉన్నాడని అన్నాడు. స్టెవార్ట్ తాజా వ్యాఖ్యలు ధోనీ అభిమానుల్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.

‘క్రికెట్ లో ఇదివరకు ధోనీ వికెట్ కీపింగ్ చూశాం. ఇంతకాలం అతనే బెస్ట్ కీపర్ అని భావించాం. కానీ అది తప్పు. మా జట్టు కీపర్ బెన్ ఫోక్స్ తెలివైన కీపర్. అతని చేతుల వేగం సెకన్లలోపే. ఫోక్స్ కు సహజంగా వచ్చిన టాలెంట్ అది. నేను సర్రే క్రికెట్ డైరెక్టర్ గా ఉన్నరోజుల్లో అతన్ని బాగా అబ్జర్వ్ చేశా. ఫోక్స్ వచ్చిన అవకాశాన్ని వదులుకోడు. క్రీజు దాటిన బ్యాటర్ ను క్షణాల్లో బోల్తా కొట్టిస్తాడ’ని స్టెవార్ట్ చెప్పుకొచ్చాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధోనీ అభిమానులు, ఫోక్స్ మంచి వికెట్ కీపర్ అయినా.. ధోనీనే అందరికంటే గొప్ప. అతన్ని ఎవరితో పోల్చకండని అంటున్నారు.

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు గట్టిపోటీస్తుంది. అన్ని విభాగాల్లో రాణిస్తుంది. బెన్ ఫోక్స్ కూడా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 22 టెస్ట్ మ్యాచులు ఆడిన ఫోక్స్.. 22 క్యాచులు పట్టాడు. 8 స్టంప్ ఔట్ లు కూడా చేశాడు. 30.72 సగటుతో 1014 పరుగులు సాధించాడు. ఇక ధోనీ 41 ఏళ్ల వయసులో కీపింగ్ అదరగొడుతున్నాడు. 2023 ఐపీఎల్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ ను రెప్పపాటులో స్టంప్ ఔట్ చేశాడు.

Tags:    

Similar News