IND vs PAK: భారత్లో.. అక్కడి ముస్లింల సపోర్ట్ మాకే ఉంది: పాక్ మాజీ ప్లేయర్

By :  Bharath
Update: 2023-10-01 16:32 GMT

భారత్ లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. వార్మప్ మ్యాచ్ లతో సహా, మెయిన్ మ్యాచ్ ల్లో కొన్ని ఉప్పల్ స్టేడియాలోనే ఉండటంతో.. పాక్ హైదరాబాద్ లోనే బస చేస్తుంది. అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టిన పాక్ కు.. ఘన స్వాగతం లభించింది. ఇక్కడి అతిథి మర్యాదలు చూసి.. తమకు చాలా నచ్చాయని పాక్ క్రికెటర్లు మెచ్చుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న పాక్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్.. తన చెత్త బుద్దిని బయటపెట్టాడు. హిందూ- ముస్లిం అంటూ రెండు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాకిస్తాన్ వార్తా చానెల్ సమా టీవీ చర్చా వేదికపై మాట్లాడిన ముస్తాక్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత్ లోని అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లోని ఎక్కువ మంది ముస్లిం ప్రజలు పాకిస్తాన్ కు సపోర్ట్ ఉంటారని చెప్పుకొచ్చాడు. ‘పాక్.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టినప్పుడు అది అర్థం అయింది. అదే మద్దతు అహ్మదాబాద్ వెళ్లినప్పుడు వస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు. ముస్తాక్ వ్యాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ఇదివరకు రానా నవీధులు హసన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.


Tags:    

Similar News