Semis Scenario: రెండు స్థానాలు.. ఐదు జట్లు.. సెమీస్కు పోయేది ఏ జట్టు?

Byline :  Bharath
Update: 2023-11-07 07:21 GMT

భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ చివరికి ఆసక్తికరంగా మారింది. సెమీస్ సినారియో పూర్తిగా మారిపోయింది. ఏ జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుంది అన్నది ఆసక్తిరేకిస్తోంది. ప్రస్తుతం టీమిండియా సెమీస్ లో అడుగుపెట్టగా.. సౌతాఫ్రికా అవకాశాలు దాదాపు ఖరారు అయిపోయింది. మిగిలిన రెండు స్థానాల కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో అంతా గందరగోళ పరిస్థితి ఉంది. చివరికి రన్ రేట్ ఆధారంగా జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే.. కివీస్, పాక్, ఆఫ్ఘన్ జట్లు దాదాపు ఒకే పొజిషన్ లో ఉన్నాయి. ఆస్ట్రేలియా వీటికంటే ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచింది. ఆసీస్, ఆఫ్ఘన్ లకు ఇంకా చెరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగా.. పాక్, కివీస్ మిగిలిన ఒక మ్యాచ్ లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

ఏ జట్టుకు ఎంత అవకాశం:

ఆస్ట్రేలియా: ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లతో జరిగే మ్యాచ్ లో ఏదై ఒక మ్యాచ్ గెలిస్తే చాలు.

న్యూజిలాండ్: మిగిలిన చివరి మ్యాచ్ లో శ్రీలంకపై భారీ తేడాతో గెలవాలి. లేదంటే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

పాకిస్తాన్ : ఇంగ్లాండ్ పై భారీ తేడాతో గెలవాలి. లేదంటే మిగతా ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఆఫ్ఘనిస్తాన్ : ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై తప్పక గెలవాలి. లేదంటే ఒక మ్యాచ్ లోనైనా భారీ తేడాతో విజయం సాధించాలి.

నెదర్లాండ్స్: ఇంగ్లాండ్, టీమిండియాలపై గెలవడంతో పాటుగా.. మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.




Tags:    

Similar News