IND vs NEP: కోహ్లీ ఫ్యాన్స్కు మిడిల్ ఫింగర్.. గంభీర్ ఏమన్నాడంటే?

Byline :  Bharath
Update: 2023-09-04 16:15 GMT

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న వైరం గురించి అందరికి తెలిసిందే. ఐపీఎల్ 2023తో ఆ వైరం మరింత ఎక్కువయింది. సీజన్ మొత్తం కోహ్లీ ఫ్యాన్స్ గంభీర్ ను ట్రోల్ చేయగా.. వాటికి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ వచ్చాడు గంభీర్. తాజాగా మరో వివాధం తెరపైకి వచ్చింది. ఆసియా కప్ లో భాగంగా నేపాల్ తో జరుగుతున్న మ్యాచ్ కు గంభీర్ కామెంటేటర్ గా వచ్చాడు. వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం ఏర్పడటంతో.. గ్రౌండ్ వదిలి వెళ్తున్న గంభీర్ ను చూసిన విరాట్ ఫ్యాన్స్.. కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. దానికి కౌంటర్ గా గంభీర్.. కోహ్లీ ఫ్యాన్స్ కు తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఫైర్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. విరాట్ ఫ్యాన్స్ తో సహా చాలామంది గంభీర్ చర్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయం కాస్త జాతీయ మీడియాకు చేరడంతో గంభీర్ ను ఆశ్రయించి వివరణ కోరింది.

గంభీర్ ఏమన్నాడంటే..?

ఈ చర్యపై గంభీర్ వివరణ ఇచ్చాడు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్త అవాస్తవమని చెప్పుకొచ్చాడు. అసలు అక్కడ కోహ్లీ ఫ్యాన్స్ లేరని, తాను ఫైర్ అయింది ఫ్యాన్స్ పై కాదని క్లారిటీ ఇచ్చారు. ‘అక్కడ కొంతమంది పాకిస్తాన్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను వెళ్లడం గమనించి ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ మన దేశాన్ని వ్యతిరేకించారు. హిందుస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. నా దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నవ్వేసి వెళ్లిపోను. అందుకే నేనలా రియాక్ట్ అయ్యా. సోషల్ మీడియాలో చూపించేదంతా అవాస్తవం. వాళ్లకు నచ్చింది మాట్లాడతారు. పోస్ట్ చేస్తారు. అక్కడ వాళ్లు ఏం చూపించాలనుకుంటారో అదే చూపిస్తారు’ అని వివాదంపై గంభీర్ క్లారిటీ ఇచ్చాడు.


Tags:    

Similar News