IND vs ENG : టీమిండియా జైత్రయాత్ర.. వరుసగా పదిహేడో సిరీస్ విజయం

Byline :  Bharath
Update: 2024-02-26 10:49 GMT

రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదుచేసింది. 192 పరుగుల చేదనలో.. ఒక దశలో భారత్ 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతామేమో? సిరీస్ సమం అవుతుందేమో? అనుకున్న దశలో శుభ్ మన్ గిల్ (55 నాటౌట్), ధ్రువ్ జురెల్(39 నాటౌట్) పట్టు బిగించారు. ఓపికగా క్రీజులో నిలబడి ఇంగ్లండ్ వ్యూహాల్ని తిప్పికొట్టారు. చకచకా సింగిల్స్ తీస్తూ.. ఒత్తిడిని ఊదేశారు. ఆరో వికెట్ కు 72 పరుగులు జోడించి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. దాంతో ఐదు మ్యాచుల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ స్విన్ ద్వయం బషీర్, హార్ట్లే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

ఈ విజయంతో భారత్ సొంతగడ్డపై తమకు తిరుగులేదని మరోసారి చాటింది. హ్యాట్రిక్ విజయంతో.. స్వదేశంలో వరుసగా 17వ టెస్ట్ సిరీస్ తన ఖాతాలో వేసుకుంది. మరో వైపు ఇంగ్లాండ్ పై భారత్ 2012లో చివరిసారి టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. అలెస్టర్ కుక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత భారత్ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. దీంతో పాటు 11 ఏళ్ల తర్వాత నాలుగో ఇన్నింగ్స్ లో 155 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసిన జట్టుగా నిలిచింది. రాంచీ లాంటి పిచ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. పిచ్ చాలా కఠినంగా మారుతుంది. ఈ క్రమంలో భారత్ 192 పరుగులను చేదించింది. 2013లో భారత్ ఆస్ట్రేలియాపై ఢిల్లీ వేదికగా 155 పరుగులు చేజ్ చేశారు. తాజాగా 192 పరుగుల భాగస్వామ్యాన్ని చేజ్ చేశారు.

Tags:    

Similar News