KFC Big Bash League : క్రికెట్కు కొత్త షాట్లు పరిచయం చేసిన మ్యాక్స్వెల్.. వీడియో వైరల్
క్రికెట్ క్రియేటివ్ షాట్లు ఆడి మ్యాడ్ మ్యాక్స్ గా పేరు తెచ్చుకున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మ్యాక్స్ వెల్. తన బ్యాట్ తో అన్నివైపులా బౌండరీలు కొడుతూ పరుగులు రాబడతాడు. ఫార్మట్ ఏదైనా తన విధ్వంసకర ఆటతీరుతో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. తాజాగా బిగ్ బాష్ లీగ్ లో మ్యాక్స్ వెల్ ఆడిన ఓ వినూత్నమైన షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్కూప్ షాట్ ను రివర్స్ లో ఆడిన మ్యాక్స్ వెల్ బౌండరీ సాధించాడు. ఈ షాట్ చూసిన అతని ఫ్యాన్స్ మ్యాడ్ మ్యాక్సీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. క్రికెట్‌లో ఇదో కొత్త రకం షాట్ అంటూ కితాబునిస్తున్నారు.
రెనెగేడ్స్, మెల్ బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ రెచ్చిపోయాడు. వర్షం కారణంగా మ్యాచ్ ను 14 ఓవర్లకు కుదించగా.. మొదట బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. చేదనలో మ్యాక్స్ వెల్ మెరుపు ఇన్నింగ్స్ (15 బంతుల్లో 32 నాటౌట్) ఆడటంతో.. మరో 11 బంతులు మిగిలుండగానే మెల్ బోర్న్ జట్టు విజయం సాధించింది.