ICC Under-19 : ఐసీసీ అండర్‌ – 19లో దుమ్ములేపుతున్న టీమ్ఇండియా..తగ్గేదే లే!

Update: 2024-02-03 01:46 GMT

ఐసీసీ అండర్‌ – 19లో (ICC Under-19) ఇండియా కుర్రాళ్లు దుమ్ములేపుతున్నారు. గ్రూప్ స్టేజ్ లో వరుసగా హ్యాట్రిక్ సాధించిన టీమిండియా (Team India)..సూపర్ సిక్స్ లోనూ వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సెమీస్ కు చేరింది. సౌత్ ఆఫ్రికా (South Africa) వేదికగా జరుగుతున్న మెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఆడిన గ్రూప్ స్టేజ్ లో ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ గెలిచి తమ సత్తా చాటుతోంది. బ్లూమ్‌ఫాంటైన్‌ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్ లో ఇండియా..132 పరుగుల భారీ తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 298 భారీ స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన నేపాల్‌.. 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియా యంగ్ స్పిన్నర్ సౌమీ పాండే 4 వికెట్లతో నేపాల్ బ్యాటర్ల నడ్డి విరిచాడు. అంతకుముందు బ్యాటింగ్ లో సచిన్‌ దాస్‌ (116), ఉదయ్‌ సహరన్‌ (100) అజేయ శతకాలతో రాణించడంతో భారత్..50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 297 పరుగులు రాబట్టింది.

భారీ టార్గెట్ ఛేదనలో నేపాల్ ఓపెనర్లు నెమ్మదించారు. ఓపెనర్లు దీపక్‌ బొహర (42 బంతుల్లో 22, 3 ఫోర్లు), అర్జున్‌ కుమల్‌ (64 బంతుల్లో 26, 3 ఫోర్లు) చేశారు. రాజ్‌ లింబాని నేపాల్ కు తొలిషాకిచ్చాడు. 13వ ఓవర్‌ లో దీపక్‌ బొహరలను ఔట్ చేసి పెవిలియన్ కు పంపించాడు. ఇక అంతే తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది నేపాల్.

కెప్టెన్‌ దెవ్‌ ఖనల్‌ (53 బంతుల్లో 33, 2 ఫోర్లు) నేపాల్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే బిషల్‌ బిక్రమ్‌ (1), దీపక్‌ దుమ్రె (0) , గుల్షన్‌ ఝా (1), దీపేశ్‌ కండెల్‌ (5)లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆఖర్లో ఆకాశ్‌ చంద్‌ (35 బంతుల్లో 19 నాటౌట్‌), దుర్గేశ్‌ గుప్తా ( 43 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్స్‌) లు నేపాల్‌ ఆలౌట్‌ కాకుండా చూశారు.




 




Tags:    

Similar News