Hardik Pandya : రోహిత్ ఫ్యాన్స్కు షాక్.. ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా

Byline :  Bharath
Update: 2023-12-15 13:02 GMT

రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ షాకిచ్చింది. ఐదు సార్లు ఐపీఎల్ కప్పులు అందించిన రోహిత్ శర్యను పక్కనబెట్టి.. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అందించింది. తాజాగా గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడింగ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడికే వెంటనే జట్టు పగ్గాలు అందించింది. ఈ నిర్ణయంతో ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.

ఐపీఎల్ 2022 గుజరాత్ ను గెలిపించిన హార్దిక్.. 2023 సీజన్ లో ఫైనల్స్ కు తీసుకెళ్లాడు. అయితే రోహిత్ ను కెప్టెన్ గా ఎందుకు నియమించారనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బీసీసీఐ కూడా రోహిత్ ను టీ20 కెప్టెన్ ను తప్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ముంబై జట్టు కూడా రోహిత్ ను తప్పించి హార్దిక్ కు జట్టు పగ్గాలు అందించడం చర్చనీయాంశంగా మారింది.




Tags:    

Similar News