IPL Auction 2024: ఐపీఎల్ వేలం.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై చర్చ
దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ 2024 మినీ వేలం జోరుగా సాగుతోంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు రికార్డ్ ధర పలుకుతూ.. చరిత్రను తిరగరాస్తున్నారు. మొదటి పాట్ కమ్మిన్స్ ను రూ.20 కోట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకోగా.. మిచెల్ స్టార్క్ ను రూ.24 కోట్లకు కోల్ కతా కొనుగోలు చేసింది. పాట్ కమ్మిన్స్ విషయంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ మధ్య తీవ్ర పోటీ జరగగా.. పంతానికి పోయిన సన్ రైజర్స్ 20 కోట్లు పెట్టి కమ్మిన్స్ ను సొంతం చేసుకుంది. ఈ విషయంపై కామెంటేటర్ హర్షా భోగ్లే చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చేసిన కామెంట్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరల ప్రస్తావన వచ్చింది.
హర్షా భోగ్లే పాట్ కమ్మిన్స్ ను ట్యాగ్ చేస్తూ.. సిడ్నీలో రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉన్నాచని ట్వీట్ చేశాడు. దానికి సమాధానంగా సన్ రైజర్స్.. సిడ్నీలో రియల్ ఎస్టేట్ గురించి తెలియదు గానీ.. హైదరాబాద్ బంజారాహిల్స్ లో మాత్రం చాలా కాస్ట్లీనే. ఎంతో మనోహరంగా, సుందరంగా ఉంటుంది అక్కడి ఏరియా అని రిప్లై ఇచ్చింది. తాజాగా హైదరాబాద్ లోకి కోకాపేట ఏరియాలో రియల్ ఎస్టేట్ ఎకరా రూ.100 కోట్లకు అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు.