IPL Auction 2024: కోట్లు కొల్లగొట్టిన హర్షల్ పటేల్.. ముంబై ఇండియన్స్కు గెరాల్డ్ కోయిట్జీ
Byline : Bharath
Update: 2023-12-19 09:55 GMT
టీమిండియా పేస్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయాడు. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన హర్షల్.. రూ.11.75 కోట్లకు అమ్ముడు పోయాడు. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ హర్షల్ కోసం తీవ్రంగా పోటీ పడగా.. చివరికి పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. గత మూడు నాలుగు సీజన్స్ లో హర్షల్ పటేల్ రాయల్ చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అటు ముంబై ఇండియన్స్ గెరాల్డ్ కోయిట్జీని కొనుగోలు చేసింది. ఈ సౌతాఫ్రికా పేస్ బౌలర్ రూ.50 లక్షల బేస్ ప్రైజ్ తో వేలంలోకి రాగా.. ముంబై అతన్ని రూ. 5 కోట్లకు దక్కించుకుంది.