‘ఆ బాధ నుంచి బయటపడేందుకే ఇలా’.. రోహిత్ శర్మ ఎమోషనల్ పోస్ట్.. వీడియో

By :  Bharath
Update: 2023-12-13 13:11 GMT

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ ఎలా స్టేడియంలో అడుగుపెట్టాలో తెలియట్లేదని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు. ఫైనల్ మ్యాచ్ తర్వాత తొలిసారి సోషల్ మీడియా ముందుకు వచ్చిన రోహిత్.. ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. వరుసగా 10 విజయాలు నమోదు చేసిన జట్టు.. ఫైనల్లో ఓడిపోవడం కలచివేసిందని తన బాధను వ్యక్తం చేశాడు. ‘ఈ బాధ నుంచి బయటపడేందుకు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సహాయపడ్డారు. అభిమానులను చూస్తే బాధేసింది. గెలుపోటములు సహజం. జీవితంలో ముందుకు సాగాల్సిందే’ అని ఓ స్పెషల్ వీడియోలో రోహిత్ ఎమోషనల్ అయ్యాడు రోహిత్.

ఫైనల్స్ లో ఓటమిని మర్చిపోయేందుకు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నానని, కానీ చాలా కష్టంగా అనిపిస్తుందని చెప్పాడు. వరల్డ్ కప్ కోసం కొన్ని నెలలుగా వేసిన ప్రణాళిక, ఆటగాళ్ల కష్టం ఏదీ ఫలించలేదని అన్నాడు. ఓటమిని జీర్ణించుకోవడం తేలికేం కాదు. జీవితం ముందుకు సాగిపోతుందని తెలుసు. కానీ, అదెంతో కష్టంగా ఉందనిపిస్తోందని ఎమోషనల్ అయ్యాడు. వరల్డ్ కప్ లో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచారు కాదా.. ఫైనల్‌లో ఏమైనా పొరపాట్లు చేశారా? అని ఎవరైనా అడిగితే మాత్రం.. అవును మేం కొన్ని తప్పులు చేశాం. ప్రతి మ్యాచ్‌లోనూ ఆ పొరపాట్లు జరిగాయి. ప్రతిసారీ పర్‌ఫెక్ట్‌ గేమ్‌ ఆడలేదు. కానీ, ‘పర్‌ఫెక్ట్‌’ స్థాయికి దగ్గరగా వెళ్లి విజయం సాధించాం. కానీ, ఫైనల్‌లో మాకు కలిసిరాలేదని రోహిత్ సమాధానమిచ్చాడు.





Tags:    

Similar News