Pak players fight: ‘మీవల్లే ఓడిపోయాం’.. పాక్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం

Byline :  Bharath
Update: 2023-09-17 16:44 GMT

ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న జట్టు పాకిస్తాన్. ఏ టోర్నీలో అయినా.. ప్రత్యర్థి జట్టుకు గట్టిపోటీ ఇచ్చే సత్తా ఉన్న ఆటగాళ్లు. ఇక వాళ్ల బౌలింగ్ యూనిట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే హైప్ తో ఆసియా కప్ లో అడుగుపెట్టింది. ఫలితం.. సూపర్ 4లో ఘోరంగా ఓడిపోయి ఇంటి దారిపట్టింది. పాక్ గత టోర్నీల్లో చూసుకుంటే గెలుపు ముందు బోల్తా పడిపోయింది. దీనికి ప్రత్యేకంగా ఒకరి తప్పని ఏం చెప్పలేం. చరిత్రలో చూసుకుంటే పాక్ ఆటగాళ్లు ప్రతీసారి గట్టి పోటీ ఇచ్చి.. కీలక సమయాల్లో ఒత్తడితో చేతులెత్తేస్తుంటారు. ఆసియా కప్ సూపర్ 4లో అదే జరిగింది. ఫైనల్ బెర్త్ ఖరారు చేసే మ్యాచ్ లో చివరి వరకు వచ్చి లాస్ట్ బాల్ కు శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఈ క్రమంలో పాక్ డ్రెస్సింగ్ రూం నుంచి వచ్చిన ఓ వార్త క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.




 


ఓడిపోయినప్పుడు ఎవరి తప్పున్నా జట్టును నడిపించినందుకు ఆ ఓటమిని తనపై వేసుకునే వాడు కెప్టెన్. అదే నాయకత్వ లక్షణం కూడా. అయితే మ్యాచ్ ఓడినందుకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. ప్లేయర్లపై మండి పడ్డాడు. వాళ్ల ఆటతీరును విమర్శిస్తూ నిప్పులు కక్కాడు. దీంతో ఆటగాళ్ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బాబర్ మాటలను తీసుకోని షాహీన్ షా అఫ్రిది.. బాబర్ తో వాగ్వాదానికి దిగాడు. తన మాట తీరు మార్చుకోవాలని, జట్టును తిట్టడం ఆపాలని సూచించాడు. వీరి మధ్య వాగ్వాదం ముదిరేసరికి మధ్యలో కలుగజేసుకున్న రిజ్వాన్ ఇద్దరికి సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన నెటిజన్స్ బాబర్ పై ఫైర్ అవుతున్నారు. కెప్టెన్ కు ఉండాల్సిన లక్షణం ఇది కాదని, కొట్టుకోవడం ఆపాలని సూచిస్తున్నారు.




Tags:    

Similar News